స్టార్ హీరోల పై శ్రీయ కామెంట్స్..!

2001 లో విడుదలైన ‘ఇష్టం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీయ శరన్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ళలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున,వెంకటేష్, బాలకృష్ణ లతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి అప్పటి నెక్స్ట్ జెనరేషన్ స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది. 37 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా వన్నె తగ్గని అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది ఈ బ్యూటీ.

విదేశీయుడు ఆండ్రూ కొస్చీవ్ ను పెళ్ళాడిన ఈ బ్యూటీ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన హలో సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రేక్షకులతో ముచ్చటించింది. హలో లైవ్ ద్వారా మాట్లాడిన శ్రీయ మన స్టార్ హీరోల పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ..

ప్రభాస్ కళ్ళంటే అంటే.. తనకు ఎంతో ఇష్టమని చెప్పింది శ్రీయ. గతంలో ప్రభాస్ తో ఈమె ‘ఛత్రపతి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ మంచి నటుడని.. అతను చాలా చదువుకున్నట్టు’ చెప్పుకొచ్చింది.’బాలు’ చిత్రంలో పవన్ కు జంటగా నటించింది శ్రీయ. అలాగే పవన్ ప్రధాన పాత్ర పోషించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో కూడా ఈమె నటించింది.

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. “అప్పట్లో ఎన్టీఆర్ ను చూస్తే చాలా సైలెంట్ గా కనిపించే వాడు.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.అతన్ని చూస్తే ముచ్చటేస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. ‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది శ్రీయ.

రజినీకాంత్ గురించి మాట్లాడుతూ.. “అతను ఒక పవర్ హౌస్. రజినీ కాంత్ గారి దగ్గర నుండీ నేను చాలా నేర్చుకున్నాను” అంటూ శ్రీయ చెప్పుకొచ్చింది. ‘శివాజీ’ సినిమాలో రజినీకాంత్ కు జంటగా నటించింది శ్రీయ.


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus