Shriya Saran: హోలీ ఆడుతూ శ్రీయ హాట్ డ్యాన్స్.. వీడియో వైరల్..

నిన్న హోలీ పండుగను పురస్కరించుకుని సినీ సెలబ్రిటీలు అందరూ రంగుల ప్రపంచంలోకి వెళ్లిపోయారనే చెప్పాలి. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా, అల్లరి చేస్తూ ఈ పండుగను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ శ్రీయ కూడా హోలీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది.

రంగుల్లో మునిగితేలుతూ.. చీర పైకి ఎత్తేసి మరీ స్టెప్పులేసింది శ్రీయ. అటు తరువాత తన భర్త ఆండ్రూతో కలిసి హాట్ హాట్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూనే అతనికి ఓ లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ సూపర్, ఆసమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది తన పెళ్లి రోజున డ్యాన్స్ చేసిన వీడియో అన్నట్టు శ్రీయ తెలుపడం గమనార్హం. తనకి హోలీ అంటే చాలా ఇష్టమని కూడా శ్రీయ తెలిపింది.

ఇదిలా ఉండగా.. శ్రీయ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్- రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనికి జోడీగానే శ్రీయ నటించబోతున్నట్టు ఎప్పటినుండో టాక్ నడుస్తుంది. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తూ బిజీగా గడుపుతోంది శ్రీయ.


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus