టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ ను కొనసాగించడంతో పాటు ఇప్పటికీ వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కబ్జా సినిమాలో శ్రియ నటించగా మార్చి నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కబ్జా మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుంది. నా సినిమాలను చూసి నా కూతురు గర్వపడాలని ఆమె అన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీ నాకు ఎన్నో మంచి సినిమాలలో నటించే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు.
శంకర్ లాంటి దర్శకుని దగ్గర పని చేసే అవకాశం దక్కిందని శ్రియ చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో పాటు కరోనా వల్ల సినిమాలకు కొంత గ్యాప్ వచ్చిందని శ్రియ పేర్కొన్నారు. కరోనా టైమ్ లో ఇకపై షూటింగ్ లకు హాజరు కావడం సాధ్యమేనా అని అనిపించిందని శ్రియ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడమే తన ధ్యేయం అని ఆమె కామెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో తమిళ సినిమాలలో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని శ్రియ చెప్పుకొచ్చారు.
నా సినిమాలను చూసిన తర్వాత నా కూతురు గర్వపడాలే తప్ప ఇబ్బందిగా ఫీల్ కాకూడదని శ్రియ కామెంట్లు చేశారు. కబ్జా సినిమాతో శ్రియ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. శ్రియను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. సోషల్ మీడియాలో కూడా శ్రియ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
శ్రియ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రియ ప్రస్తుతం పరిమితంగా రెమ్యునరేషన్లు తీసుకుంటుండటం గమనార్హం. శ్రియ కెరీర్ లో మరింత సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా క్రేజీ సినిమాలలో శ్రియ ఆఫర్లను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.