Shriya: మరోసారి పబ్లిక్ గా భర్తతో శ్రీయ సరసాలు.. వీడియో వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ పెళ్ళైన తర్వాత సినిమాలు కాస్త తగ్గించేందేమో కానీ గ్లామర్ డోస్ పెంచడంలో మాత్రం తగ్గేదే లే.. అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలో తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి ఆమె వరుస టూర్లు వేస్తుండడాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. అంతేకాకుండా వరుసగా ఆమె రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వస్తోంది.అంతేకాదు వీళ్ళ రొమాంటిక్ వీడియోల జోరు కూడా పెరుగుతుంది.

మొన్నామధ్య పబ్లిక్ గా శ్రీయ యద పై ముద్దు పెట్టుకున్నాడు ఆమె భర్త ఆండ్రూ. ఈ వీడియో సోషల్ మీడియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఇప్పుడు మరో రొమాంటిక్ వీడియోతో కూడా సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టింది శ్రీయ. ఈ వీడియో విషయానికి వస్తే శ్రీయ రొమాంటిక్ గా ఓ పాట పాడుతుంది. దానికి ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ డ్యాన్స్ చేసాడు. ఆ పాట ఫినిషింగ్ లో ‘ఉమ్మ ఉమ్మ’ అంటూ లిరిక్స్ ఉన్నాయి.

దాంతో ఆండ్రూ.. వెంటనే వచ్చి శ్రీయకు లిప్ లాక్ పెట్టాడు.శ్రీయ కూడా అందంగా నవ్వుతు ముద్దుకి సహకరించింది. శ్రీయ ఇన్స్టా ఖాతాకు 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ‘సూపర్ కపుల్’ ‘రొమాంటిక్ కపుల్’ అంటూ ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మీరు కూడా ఓ లుక్కేయండి :

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus