శృతి లుక్ అదిరింది!

వెండితెరపైనా కమల్ హాసన్ కూతురుగా శృతి హాసన్ మొట్టమొదటిసారిగా నటించనున్న సినిమా “శభాష్ నాయుడు”. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి అమెరికాలో సెటిల్ అయిన యువతిగా కనిపించనుంది. అందుకోసం అమ్మడు బాబ్డ్ హెయిర్ స్టైల్ లో, ట్రెండీగా దర్శనమివ్వనుందట. మామూలుగానే అందాలు ఆరబోయడానికి ఏమాత్రం మొహమాటపడని శృతి.. వెస్ట్రన్ క్యారెక్టర్ కావడంతో తాజా చిత్రంలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోందట.

ఇటీవలే అమెరికా షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో చెన్నైలో మొదలుకానుంది. రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అమల అక్కినేని ఓ ముఖ్యభూమిక పోషించనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus