టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఒక సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా చిరంజీవికి జోడీగా మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో పాటు సలార్ సినిమాలో శృతి నటిస్తున్నారు. తాజాగా శృతి హాసన్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని తెలుస్తోంది. సలార్ మూవీలో శృతి హాసన్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని ఈ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది.
అయితే శృతి హాసన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండటం వల్లే శృతి హాసన్ ఈ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని బోగట్టా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ స్టార్ హీరోయిన్ ఫాలో అవుతున్నారు. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
శృతి హాసన్ కు సోషల్ మీడియాలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు శృతి హాసన్ రేంజ్ పెరుగుతుండగా ఇతర ఇండస్ట్రీలపై శృతి హాసన్ దృష్టి పెట్టాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
కెరీర్ విషయంలో శృతి హాసన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శృతి హాసన్ తెలుగుతో పాటు తమిళ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?