Shruti Haasan: ఈ కామెంట్లు విన్నారంటే ఆ హీరోలంతా శృతిపై ఫైర్ అవ్వడం ఖాయం!

ఫేమస్ హీరోయిన్స్ ను కాస్ట్ చేయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. సదరు కాంబినేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా ఒక్కోసారి ఆ హీరోయిన్లు ఎంత హీరోల పక్కన నిజంగా సెట్ అవుతారా, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు దర్శకనిర్మాతలు. సినిమా రిలీజ్ అయ్యాక హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదని, హీరో పక్కన హీరోయిన్ మరీ చిన్నపిల్లలా ఉందని, లేదా హీరో కంటే హీరోయినే పొడుగ్గా ఉందని రివ్యూలు, కామెంట్లు వస్తాయి.

Shruti Haasan

ఈ పాయింట్ గురించి శృతిహాసన్ (Shruti Haasan) చేసిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. టిండర్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ పాపులర్ యూట్యూబర్ కుషితతో చేసిన ఓ డ్రైవ్ ఇన్ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. “నేను 5.9 అడుగుల హైట్ ఉంటాను, అందరు హీరోలు యాపిల్ బాక్స్ మీద నిలబడడానికి ఇష్టపడరు కదా” అనేసింది.

శ్రుతిహాసన్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఆమె ఎంత మంది పొట్టి హీరోలతో నటించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన ఈ కామెంట్స్ సదరు హీరోల అభిమానులను బాగా హర్ట్ చేసేలా ఉన్నాయి. అదే ఇంటర్వ్యూలో ఇంకాస్త బోల్డ్ గా మాట్లాడుతూ “మనం వాళ్ల కింద పడుకున్నప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకోరు” అనేసింది.

శృతి ఈ స్థాయిలో కామెంట్ చేయడం ఇదే మొదటిసారి అనుకోవాలి. ఇక కెరీర్ గురించి చింత లేదు కాబట్టి శృతి ఇలా కామెంట్ చేసిందా లేక పొట్టి హీరోల పక్కన నటించి నటించి విసిగిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జియో యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ లో శృతి చెప్పిన మరిన్ని బోల్డ్ సంగతులు మీరూ చూసేయండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus