Prakash Raj, Pawan Kalyan: పవన్ ఎదురుగా ప్రకాష్ రాజ్.. తప్పని ఫైట్.!

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) , విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj)  మధ్య నెలకొన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చాయి. సనాతన ధర్మం, బీజేపీ మద్దతు వంటి వివాదాస్పద అంశాలపై వీరిద్దరూ సామాజిక వేదికల్లో తరచుగా ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ మాటల తూటాలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ను మరింత పెంచాయి.

Prakash Raj, Pawan Kalyan

ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ ఒకే సినిమాకు కలిసి పనిచేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రల మధ్య ముఖ్యమైన మధ్య కీలక సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని తాజా షెడ్యూల్‌లో చిత్రీకరించబడుతున్నాయి.

అలాగే ఈ షూట్ లో పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య ఫైట్ సీన్ కూడా చిత్రీకరించబడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో, వీరిద్దరూ ఒకే సెట్‌పై పనిచేయడం అభిమానులను, ప్రేక్షకులలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరూ ‘వకీల్ సాబ్’ చిత్రంలో కలిసి నటించినప్పటికీ, అప్పట్లోనూ వీరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ ఆ సెట్ లో ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకున్నట్లు ఆ సినిమాకు పని చేసిన వారు తెలిపారు.

ఇక పవన్ కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలపై కూడా దృష్టి సారించాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలో పాల్గొన్న పవన్, ఇప్పుడు ‘OG’ చిత్రానికి పూర్తి సమయం కేటాయించాడు. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో భాగమవుతున్నారు.

మంగళవారం డైరెక్టర్.. ఆశ చూపి హ్యాండ్ ఇచ్చిన హీరో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus