పాత్ర కోసం, సినిమా కోసం యాక్షన్ సీన్స్ చేయడానికి ఇప్పటి హీరోయిన్లు వెనుకంజ వేయడం లేదు. మామూలుగానే ఫిట్‌గా ఉండే నాయికలు, యాక్షన్ సీన్స్‌లో నటించాలి అనేసరికి మరింత ఫిట్ అవ్వడానికి జిమ్‌ల్లో కష్టపడుతున్నారు. మరోవైపు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి పనిలోనే ఉంది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో కొన్ని యాక్షన్ సీన్స్‌కు ఆమెకు ఉన్నాయని టాక్. ‘సలార్’సినిమాకు సంబంధంచి శ్రుతి హాసన్ పాత్ర గురించి తొలి నాళ్లలో చాలా రకాల వార్తలొచ్చాయి.
ఇందులో శ్రుతి జర్నలిస్ట్‌గా నటిస్తోందని, పాత్ర నిడివి చాలా తక్కువ అని పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కావట. సినిమాలో శ్రుతిది పూర్తి నిడివి పాత్రే నట. అంతేకాదు సినిమాలో శ్రుతికి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. దాని కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటోందట. మరోవైపు ‘సలార్’ను రెండు పార్టులుగా విడుదల చేస్తారని వార్తలు ఇంకా రూమర్లుగా కొనసాగుతున్నాయి. ఇంకా చిత్రబృందం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సినిమా మీద పెరిగిన హైప్‌ను క్యాష్చేసుకోవాలనుకుంటున్నారో, లేక సినిమా కథలో అంత అవసరం ఉందో తెలియదు కానీ… సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.