శృతి హాసన్ తో రొమాన్స్ చేయనున్న అమెరికన్ నటుడు?

టి రాజీవ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, రమ్యకృష్ణ జంటగా నటించనున్న చిత్రం శభాష్ నాయుడు. ఈ చిత్రంలో కమల్ కూతురి పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మే 16 నుంచి ప్రారంభం కానుండగా.. దాదాపు 80 శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది.

తాజా సమాచారం ప్రకారం ఇండో- అమెరికన్ నటుడు మను నారాయణ్ ఈ చిత్రంలో శృతి హాసన్ కు జంటగా నటించనున్నాడట. గతంలో బాంబే డ్రీమ్స్, లవ్ గురు, మనీ నెవర్ స్లీప్స్ చిత్రాల్లో  మను నటించాడు. కాగా శభాష్ నాయుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus