Siddharth, Prabhas: ప్రభాస్ నా ఫేవరెట్ హీరో..సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్!

  • October 6, 2023 / 06:18 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిద్ధార్థ్ కి తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్థ్ కి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇకపోతే తాజాగా ఈయన చిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో ఈయన పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా సిద్ధార్థ్ ఎన్నో విషయాలు గురించి మాట్లాడటమే కాకుండా తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాలను కూడా వెల్లడించారు. నాకు తెలుగులో ప్రభాస్ ఫేవరెట్ హీరో అని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

ప్రభాస్ గారికి తాను పెద్ద అభిమానిని వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా తనకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను నటించిన సినిమా ప్రభాస్ నటించిన సినిమా రెండు ఒకేరోజు విడుదలయితే నేను నా సినిమాకి కాకుండా ప్రభాస్ సినిమాకి వెళ్లి చూస్తానని ఈయన తెలిపారు. ఇలా నా సినిమాకి కాకుండా ప్రభాస్ సినిమాకి తాను ప్రాధాన్యత ఇస్తాను అంటూ సిద్ధార్థ్ చెప్పడంతో ఈయనకు ప్రభాస్ అంటే ఎంత అభిమానం ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇలా ప్రభాస్ గురించి ఆయనపై తనకు ఉన్న అభిమానం గురించి (Siddharth) సిద్ధార్థ్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus