బుల్లి తెరపై మెరుస్తున్న వెండి తెర తారలు

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బడా తారలు ఎందరో ఉన్నారు. అయితే సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా…కమర్షియల్ యాడ్స్ పరంగా ప్రముఖ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నా…అదే చరిష్మాతో, అదే ఊపుతో బుల్లి తెరపై కూడా తమ టాలెంట్ ను ప్రదర్శించారు మన తారలు…అయితే వెండి తెరపై మెరిసిన వారుల్లో బుల్లి తెరపై కనిపించి మెప్పించిన తారల గురించి ఒక లుక్ వేద్దాం రండి…

సూర్యహిందిలో సంచలనం సృష్టించిన కౌన్ బనేగా కరోర్ పతిని 2012లో తొలుత తమిళ్ లో తమిళ బుల్లి తెరపై హోస్ట్ చేసిన ఘనత మన సూర్యకే దక్కుతుంది. ‘నీంగలుమ్ వెళ్ళాలం ఒరుకోడి’ అన్న పేరుతో తమిళ్ లో కౌన్ బనేగా కరోర్ పతిని అయిదు నెలలు చేశాడు. అయితే అసలు ఈ ప్రోగ్రామ్ ని ముందు తమిళ సూపర్ హీరో విజయ్ చెయ్యాల్సి ఉంది. అయితే కొన్ని అనువార్య కారణాల వల్ల తాను చెయ్యలేదు.

ప్రకాష్ రాజ్ఇక హింది కౌన్ బనేగా కరోర్ పతిని తమిళ బాషలో రెండో సీసన్ లో అంటే 2013లో యాక్ట్ చేసి ఉర్రూతలూగించిన ఘనత ప్రకాష్ రాజ్ కి దక్కుతుంది. అయితే అంతకన్నా ముందు 2003లోనే ప్రకాష్ రాజ్ ఒక సీరియల్ లో నటించగా…తమిళ్ కౌన్ బనేగా కరోర్ పతి మొదటి సీరీస్ లో ఇతన్ని సైతం తీసుకోవాలి అని ఆలోచన సైతం చేశారు…కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం సూర్యకి దక్కింది.

ఆరవింద్ స్వామిఇక తమిళ ‘నీంగలుమ్ వెళ్ళాలం ఒరుకోడి’ అదే హింది కౌన్ బనేగా కరోర్ పతి మూడో సీసన్…2016లో మన ధృవలో విలన్, రోజా, ముంబై లో హీరో అయినటువంటి ఆరవింద్ స్వామి చేశాడు. ఆరవింద్ తన యాక్టింగ్ తో దుమ్ము దులిపేశాడు అనే చెప్పాలి.

పునీత్ రాజ్ కుమార్ఇక హింది కౌన్ బనేగా కరోర్ పతిని కన్నడలో సైతం తెరకెక్కించారు. అందులో కర్నాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించడంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ ప్రోగ్రామ్ ను 2012లో పునీత్ మొదలు పెట్టాడు. ఇక ఈ షో ను కన్నడలో కన్నడడా కోట్యధిపతి అని పిలుస్తారు.

సురేష్ గోపిఇక హింది కౌన్ బనేగా కరోర్ పతి మళయాళ వర్షన్ లో మన మళయాళ నటుడు సురేష్ గోపి నటించి మెప్పించాడు. 2014లో మొదలయిన ఈ షో…ఇప్పటికి 260 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.

నాగార్జునఇక మన తెలుగులో 2014లో కౌన్ బనేగా కరొర్పతిని మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నాగ్ నటించాడు. దాదాపుగా 2014 నుంచి 2016వరకూ రెండు సీసన్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రోగ్రామ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

చిరంజీవిఇక 2016లో నాగ్ తరువాత కౌన్ బనేగా కరొర్పతిని మీలో ఎవరు కోటీశ్వరుడుగా నెత్తిన పెట్టుకున్న హీరో మెగాస్టార్. 9ఏళ్ల తరువాత టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిరు ఈ ప్రోగ్రామ్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. అయితే సినిమా స్టార్స్ తో టీఆర్‌పీ మ్యానేజ్ చేస్తూ మమా అనిపిస్తున్నాడు.

లక్ష్మి మంచులక్ష్మి టాక్ షో…ప్రేమతో లక్ష్మి, లక్ ఉంటే లక్ష్మి, దూసుకెళ్తా, సూపర్ జోడీ, ఇలా వరుసగా మంచి మంచి గేమ్ షోస్ తో దూసుకుపోతూ వరుస కార్యక్రమాలు చేస్తుంది మన టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లక్ష్మి.

కిచ్చా సుదీప్ప్రముఖ కన్నడ హీరో సుదీప్ కన్నడలో బిగ్ బాస్ షో ను చేశాడు. 2013లో మొదలయిన ఈ ప్రోగ్రామ్ దాదాపుగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుని, నాల్గొవ సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ ప్రోగ్రామ్ కన్నడలో చాలా ఛానెల్స్ లో టెలీకాస్ట్ అయ్యింది.

రాణా దగ్గుపాటిప్రముఖ హీరో, టాలీవుడ్ యాక్టర్ దగ్గుపాటి రాణా…తెలుగులో సరికొత్త కార్యక్రమంతో “నంబర్1 యారీ విత్ రాణా” అంటూ దూసుకొస్తున్నాడు. అయితే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది అని రాణా యాడ్ చూసినప్పుడల్లా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అసలే బాహుబలితో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాణా ఈ ప్రోగ్రామ్ తో ఏలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి.

ఎన్టీఆర్తెలుగు బుల్లి తెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నాడు. బిగ్ బాస్ అని కన్ను కొడుతూ చిన్న పాటి ట్రైలర్ తో ఇప్పటికే దుమ్ము దులుపుతున్న ఎన్టీఆర్ త్వరలోనే టీవీల్లో కనిపించి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రముఖ మా టీవీ ఛానెల్ లో ప్రదర్శించబోతున్న ఈ కార్యక్రమంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మొత్తంగా ఇలా మన స్టార్స్ అందరూ వెండి తెరపైనే కాదు…బుల్లి తెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus