శింబు తాజా చిత్రంలో ముగ్గురు కథానాయికలు!

“త్రిష ఇళ్ళ నయనతార” ఫేం ఆదిక్ రవిచంద్ర దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా తెరకెక్కనున్న సినిమాకు “ఆన్బానవన్ అసరాధవన్ అదంగాధవన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. టైటిల్ ను బట్టి ఈ సినిమాలో శింబు మూడు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే.. త్రిపాత్రాభినయం చేస్తాడా లేక ఒకడే ముగ్గురిగా నటిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. ఈ సినిమాలో శింబు సరసన నటించేందుకు ముగ్గురు అందాల భామలను గత కొంత కాలంగా వెతుకుతున్నాడట దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్. ఇంకో వారం రొజుల్లో హీరోయిన్లు ఎవరనేది ఎనౌన్స్ చేస్తానని చెప్పాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా ప్రి-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్నాయి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus