Prabhas: చాలా సాదాసీదాగా దర్శనం ఇవ్వబోతున్న ప్రభాస్‌.. ఎందుకంటే?

  • May 20, 2023 / 08:01 PM IST

ప్రజెంట్‌ టాలీవుడ్‌లో హీరోల ఫస్ట్‌లుక్‌ అంటే అదొక వార్‌ అనేలా తయారైంది. హీరోను సూపర్‌ హీరోలా మార్చి చూపించినా ఒక్కోసారి అభిమానులు శాటిస్‌ఫై అవ్వడం లేదు. దీంతో కొత్తగా చూపించడం ఎలా అనే మాట పట్టుకుని సినిమా టీమ్‌ కుస్తీలు పడుతోంది అని చెప్పొచ్చు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమా విషయంలో టీమ్‌ ఆలోచనలు వేరేగా ఉన్నాయట. ఎంత సాదాసీదాగా చూపించాలా అని ఆలోచిస్తున్నారట. సగటు మగాడు ఎలా ఉంటాడో అలానే చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

అవును.. అంత చర్చలు జరిగే ఫస్ట్‌లుక్‌కి అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా ఉంది. ‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరల్డ్ వైడ్‌ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. దాంతోపాటు అక్కడి నుండి ప్రభాస్‌ సినిమాలు భారీ స్థాయిలో ఉండాలి అనే అప్రకటిత రూల్‌ వచ్చేసింది. దీంతో ప్రభాస్‌ లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ పాత్రలు, లుక్‌ల్లో చూపిస్తున్నారు. అయితే మారుతి మాత్రం అలా అనుకోలేదు. చూపించడం లేదు కూడా. అందుకే ఈ లుక్‌ చర్చ నడుస్తోంది.

‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ అంటూ భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌… మారుతితో ఓ చిన్న సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే పేరు అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చిందని సమాచారం. దీంతో స్పెషల్‌ డే ఒకటి చూసుకొని సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్‌ ప్రభాస్‌ లుక్స్‌కి దీనికి అస్సలు సంబంధం లేకుండా ప్లాన్‌ చేస్తున్నారు. దీని కోసం మిడిల్ క్లాస్‌ అబ్బాయి లుక్‌ను అనుకుంటున్నారట.

అంటే.. ప్రభాస్‌ (Prabhas) ఓ లుంగీ కట్టుకుని నడుచుకుని వచ్చేలా లుక్‌ ఉంటుందని చెబుతున్నారు. మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్లు ఇలా ఎక్కువగా కనిపిస్తుంటారనే విషయం తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ ఇద్దరు కథానాయికలు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus