అదే తరహాలో సింగం3 కూడా!!

  • February 10, 2017 / 06:05 AM IST

తన నటనతో….అందంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న తమిళ హీరో ‘సూర్య’. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సూర్య తనకంటూ మంచి ఇమేజ్ ను సంపాదించుకుని ముందుకు దూసుకుపోతున్నాడు…అదే క్రమంలో సింగం తో అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ సింగం తో మాస్ స్టామినాను రుచి చూపించిన సూర్య….అదే క్రమంలో సింగం2 కూడా తీశాడు…ఆ సినిమా కూడా బ్లాక్ బస్టెర్ హిట్ కావడంతో….కాస్త గ్యాప్ ఇచ్చి కొన్ని ప్రయోగాత్మక సినిమాలు తీసి…మళ్లీ సింగం3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు….అసలైతే సీక్వేల్స్ అనేవి మా ఆసినిమాల విషయంలో పెద్దగా వర్క్ ఔట్ అయిన దాకలాలు చాలా తక్కువే అని చెప్పాలి…అలాంటిది ఒక సినిమాని 3 సార్లు తీసి మెప్పించే ప్రయత్నం చేశాడు సూర్య. మొదటి రెండు భాగాల్లో మంచి హిట్స్ అందుకున్న సూర్య…మరి మూడో పార్ట్ తో మెస్‌మెరైజ్ చేశాడా అంటే….అవుననే అంటున్నారు…ప్రేక్షకులు….అయితే అదే క్రమంలో ఈ సినిమాలో కాస్త వీక్ పాయంట్….మైనస్ పాయింది గురించి చర్చ నడుస్తుంది.

ఇంతకీ ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటి అని కాస్త మ్యాటర్ లోకి వెళితే….డైరక్టర్ హరి సినిమా అంతా సేం మొదటి రెండు సినిమాల్లానే ఎమోషనల్ గా మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని తీసినట్టే కనిపించినా మొదటి రెండు పార్ట్ లకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వగా ఈ ఎస్-3కు హరీస్ జైరాజ్ ను తీసుకున్నారు. హారీష్ లాంటి ట్రెండీ మ్యూజిక్ డైరక్టర్ ఈ సినిమాకు ఎంతవరకు సూట్ అవుతాడని తీసుకున్నారో ఏమో కాని సినిమాలో దేవి మ్యూజిక్ ఉంటే మళ్లీ మరో యముడు అయ్యి ఉండేది అంటున్నారు. టెంపర్ చూపించే పోలీస్ పాత్రలో సూర్య మరోసారి ఇరగదీశాడు. అయితే ప్రతి సీన్ దేని కదే ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీ రోల్ పోశిస్తుంది. ఈ సినిమా చూశాక అదే దేవి అయితే అన్న ఆలోచన ప్రతి ఒక్క ఆడియెన్ కు రాక తప్పదు. ఎస్-3లో దేవి ఉంటే మళ్లీ ఆ సినిమాకే కొనసాగింపు అనుకుంటారనే ఉద్దేశంతో ఎస్-3కి దేవిని తీసుకోలేదు కాని సినిమాకు అదే మైనస్ అయ్యిందని అంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus