Chinmayi: భార్య ప్రెగ్నెంట్‌… భర్త చెత్త కోరిక… షాకింగ్‌ పోస్ట్‌ చేసిన సింగర్‌ చిన్మయి!

సమాజంలో జరిగే అక్రమాలు, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రస్తావించే సినిమా సెలబ్రిటీల్లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఒకరు. రీసెంట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. తనకు ఓ అభిమాని పంపించిన మెసేజ్‌ను షేర్‌ చేశారు. అందులో ఓ భర్త చెత్త కోరిక, భార్య కష్టం కనిపిస్తోంది. దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘‘వీళ్లే సొసైటీలో నలుగురు. ఇదే వాళ్ల కల్చర్. ఆ నలుగురికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని ఇప్పుడు అర్ధం అవుతుందా?’’ అంటూ సలహా ఇచ్చింది.

‘‘హలో చిన్మయి (Chinmayi) గారూ.. నా సమస్యను మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తోంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ టైంలోనో, లేదంటే ఇతర కారణాల వల్ల భర్తతో ఫిజికల్‌గా కలవలేదు. కాబట్టి వాళ్లు బయట వేరే వాళ్లతో రిలేషన్ పెట్టుకోవడం లీగల్ అంట. ఇంట్లో అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు. నేనేం చేయలేకపోతున్నాను. తిరిగి అడిగితే ఓపిక పట్టాలి, సర్దుకుపోవాలి అని నాకే రివర్స్‌లో చెబుతున్నారు’’ అంటూ తన బాధను మెసేజ్‌ రూపంలో ఓ ఫ్యాన్‌ పంపారు. దానినే షేర్‌ చేశారు.

మనకి నచ్చని పని, మనకి ఇష్టం లేని పని చేయాలనుకున్నప్పుడు చాలామంది నలుగురూ ఏమనుకుంటారో అని ఆలోచించి ఆగిపోతుంటారు. అలాంటి నలుగురు గురించి ఆలోచిస్తే నీకు నువ్వే అన్యాయం చేసుకుంటావు అంటూ చిన్మయి చెప్పడంతో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు వాళ్ల పేరెంట్స్ కూడా ఇదే ఫాలో అయ్యారేమో.

ఒక్కసారి ఇదే ప్రశ్న అడగమని చెప్పండి ఆ అమ్మాయి అత్త గారిని’ అంటూ ఓ నెటిజన్‌ స్ట్రాంగ్‌ కామెంట్ చేశారు. ‘‘నాకు తెలిసి మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు.. మీకు క్లియర్‌గా తెలుస్తుంది కదా తప్పు ఎవరిదో. మీ భర్తకు విడాకులు ఇవ్వడమే మీరిచ్చే పనిష్‌మెంట్‌. ధైర్యం చేసి అతనికి విడాకులు ఇచ్చేయండి’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus