సింగర్ మంగ్లీ పరిచయం అవసరం లేని పేరు నటిగా సింగర్ గా యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఎంతో బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు. ఇక సింగర్ మంగ్లీ పాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఎంతో అద్భుతమైన పాటలను ఆలపిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ప్రతి ఏడాది పండగ వచ్చిందంటే చాలు తప్పకుండా ఆ పండుగ కోసం మంగ్లీ ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియోని అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు.
అయితే ప్రస్తుతం హైదరాబాదులో బోనాలు జరుగుతున్న నేపథ్యంలో (Mangli) ఈమె బోనాల కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడి వీడియో చేస్తున్న నేపథ్యంలో ఈమెకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ పాట షూటింగ్ సమయంలో మంగ్లీ కాలు జారి పడటంతో ఈమె కాలికి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం అయితే తన పరిస్థితి మంచిగానే ఉందని కొద్ది రోజులు రెస్ట్ అవసరం అంటూ వైద్యులు వెల్లడించారు. ఇలా ప్రవేట్ సాంగ్స్ వీడియోస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంగ్లీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ భాషలలో కూడా పాటలను ఆలపిస్తూ అక్కడ కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!