Sunitha: ఇది చాలా దురదృష్టకరం అంటున్న సునీత..?

సింగర్ సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సునీత ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు అభిమానులు కోరిన పాటలను పాడటంతో పాటు వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి లాక్ డౌన్ రూల్స్ అమలవుతున్న సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం లాక్ డౌన్ ప్రకటన వచ్చిన తరువాత మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు.

మందుబాబులు ఈ విధంగా షాపుల ముందు క్యూ కట్టడం గురించి సునీత మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. లాక్ డౌన్ కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల పరిస్థితుల్లో కొంతమేర మార్పు వస్తుందని తాను భావిస్తున్నానని సునీత వెల్లడించారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు సరుకులు కొనడానికి షాపుల ముందు క్యూ కట్టారని రెండు రోజుల తర్వాత రద్దీ తగ్గవచ్చని సునీత అభిప్రాయపడ్డారు.

అయితే లాక్ డౌన్ ప్రకటన తర్వాత కొంతమంది కిరాణా షాపుల ముందు క్యూ కట్టకుండా వైన్ షాపుల ముందు క్యూ కట్టారని ఇలా జరుగుతుందని తాను అస్సలు ఊహించలేదని సునీత అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశమని ఆమె తెలిపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సేఫ్ గా ఉండాలని సునీత పేర్కొన్నారు. సునీత సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కావడంతో పాటు అభిమానులకు కీలక సూచనలు చేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus