Sunitha: ఆయన మరణం నన్ను ఎంతగానో కృంగదీసింది.. సునీత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన వారిలో సింగర్ సునీత కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో సింగర్ గా రాణిస్తున్న సునీత తన మధురమైన గాత్రంతో కొన్ని వేల సంఖ్యలో పాటలు పాడి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆమె పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. సునీత సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.

సింగర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇటీవల సునీత రెండవ పెళ్లి చేసుకోవడం వల్ల తరచూ ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. తన జీవితంలో ఎన్నో కష్టాలు చూసానని ప్రస్తుతం తన కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు చర్చించటమే కాకుండా

ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం గారిని తలచుకొని చాలా ఎమోషనల్ అయింది. లెజెండరీ సింగర్ గా గుర్తింపు పొందిన బాలసుబ్రమణ్యం అంటే సునితకు చాలా ఇష్టం. ముద్దుగా ఆయనను మామయ్య అని పిలుచుకునేది. కష్ట సుఖాలలో బాలసుబ్రమణ్యం సునీతకు చేదోడువాదోడుగా నిలిచాడు. ఆయన మరణం తర్వాత సునీత చాలా కృంగిపోయింది. జీవితంలో అందరికంటే ఎక్కువ ఆత్మీయమైన వ్యక్తిని కోల్పోయానని పలు సందర్భాలలో కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక ఈ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ…” నా జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి బాలు గారు. అతి ముఖ్యమైన వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను. ఆయన మరణించిన తర్వాత చాలా కృంగిపోయాను. నా జీవితంలో అంతకుమించి చలించే సంఘటన ఇంకేముంటుంది? అని తెలిపింది. ఆయన మరణ వార్త తర్వాత జీవితంలో జరిగిన ఏ సంఘటనలు నన్ను అంతగా కదిలించటం లేదు. బాలసుబ్రమణ్యం గారి జ్ఞాపకాలతో ఆయన చూపిన దారిలో నడవటమే ఆయనకు మనం ఇచ్చే గౌరవం అని” సునిత చెప్పుకొచ్చింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus