టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాదు.. తన అందానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయిన్లతో సమానంగా సునీత క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించింది సునీత. అప్పటినుండి ఆమెకి సంబంధించిన ఏదొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తన భర్తతో కలిసి సునీత పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తుంది సున్నిత.
తాజాగా సునీత తన భర్తతో కలిసి బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది. ఇప్పటికే రామ్ వీరపనేని మ్యాంగో వీడియోస్ తో పాటు మరికొన్ని డిజిటల్ ఛానెల్స్ కు హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా సునీత తన భర్తతో కలిసి మ్యాంగో బ్యానర్ పై వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ మధ్యకాలంలో చాలా మంది వెబ్ సిరీస్ లపై పడ్డారు. ఇప్పుడు సునీత కూడా అదే ఫాలో అవ్వాలని చూస్తుంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సునీత ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రస్తుతం సునీత టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ కి న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది.