కొన్ని సందర్భాలు, సన్నివేశాలు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటాయో. అలంటి సందర్భమే నేడు సునీత ఇంట్లో చోటు చేసుకుంది. విడాకులు తీసుకొని కొనేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఎట్టకేలకు మ్యాంగో రామ్ ను రెండో పెళ్లి చేసుకొనేందుకు నిశ్చయించుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ కు శుభారంభాన్ని పలికింది. డిసెంబర్ 2020లోనే ఆమె పెళ్లి జరగాల్సి ఉండగా.. ముహుర్తాలు కుదరక పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. జనవరి 9న ఆమె రెండో వివాహం హైద్రాబాద్ లో సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరగనుంది.
ఇవాళ సాయంత్రమే సుమూహుర్తం. పెళ్లి పనులు మొదలైపోయాయి. సునీతను పెళ్లి కూతుర్ని చేసే బాధ్యతను ఆమె పిల్లలు తీసుకొన్నారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికూతురైన సునీతను ఇద్దరు పిల్లలు ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటో చూసి అందరూ మురిసిపోతున్నారు. ప్రెజంట్ జనరేషన్ లో రెండో పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. అందుకు పిల్లల సమ్మతం లభించడం, వాళ్ళే పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం, పెళ్ళికూతుర్ని కూడా చేయడం అనేది సునీతకు మాత్రమే దక్కిన అదృష్ణం.
ఇక రాత్రి అంగరంగ వైభవంగా జరగనున్న పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ అవ్వడం ఖాయం. సో, మిసెస్ సునీత రామ్.. విష్ యు వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.