“ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..” అనే పాటతో సింగర్ సునీత తన గాత్రం లోని మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అనేక హిట్ సాంగ్స్ ఆలపించి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పాటలకే కాదు.. మాటలకూ ఫిదా అయిన వారు బోలెడుమంది. సునీత గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 750కిపైగా చిత్రాలకు పని చేశారు. వృత్తిగత జీవితంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి విజేతగా నిలిచిన ఈమె.. వ్యక్తిగత జీవితంలో కొంత తడబడ్డారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీత.. ఇద్దరి పిల్లలకి తల్లి అయ్యారు.
అయితే దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చి కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి పిల్లలే లోకంగా బత్రికారు. పెళ్లి చేసుకోవమని ఎంతమంది సలహా ఇచ్చినా.. సున్నితంగా తోసిపుచ్చారు. రీసెంట్ గా రేణు దేశాయి రెండో పెళ్లి కి సిద్ధంకావడం సునీత ఆలోచనలో మార్పు తీసుకువచ్చింది. తనకి కూడా తోడు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే రెండో పెళ్లికి ఓకే చెప్పినట్లు సమాచారం. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారా? లేకుంటే తనకి నచ్చిన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తారా? అనేది ఇంకా తెలియదు. ఈ వార్తలపై సునీత స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.