టాలీవుడ్ సింగర్ సునీత గతేడాది రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. సునీత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శనివారం నాడు ఈమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గామారింది .
ఆ పోస్ట్ లో ఏముందంటే.. సునీత తమ మామిడి తోటలోని మామిడిపండు పట్టుకుని ‘బ్లెస్డ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన చాలా మంది సునీత తల్లి కాబోతుందేమో అనుకున్నారు. ఇదే అనుమానాన్ని కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు. అలానే కొన్ని మీడియా సంస్థలు సునీత ప్రెగ్నెంటా..? అని వార్తలు రాశాయి. దీంతో ఎట్టకేలకు సునీత స్పందించింది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెట్టింది.
వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ‘దేవుడా.. జనాలు ఎంత క్రేజీగా ఉన్నారు. మా మామిడి తోటలో మొదటి క్రాప్ వచ్చిందని ఫొటో తీసి పోస్ట్ చేస్తే ఏదేదో ఊహించుకుని రాసేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు. మీకో దండం రా నాయనా’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.