Sitara: వామ్మో.. మహేష్ కూతురు తొలి యాడ్ రెమ్యునరేషన్ అంతా?

  • July 5, 2023 / 07:16 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాల ద్వారా ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో యాడ్స్ ద్వారా అంతకు మించి ఆదాయం వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కూతురు సితారకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార వయస్సు తక్కువే అయినా ఆమె టాలెంట్ కు ఫిదా ఆయ్యేవాళ్ల సంఖ్య తక్కువే కాదు. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం సంచలనాలు నమోదవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ యాడ్ కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

సితారకు (Sitara) ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 642 పోస్టులతో సితార ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. సితార కమర్షియల్ యాడ్ లో నటించడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సితార వయస్సు 12 సంవత్సరాలు కాగా సితార టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ బాబు, సితారను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. సితార నటించిన యాడ్ సితారలోని టైమ్ స్క్వేర్ పై ప్రదర్శితం కావడం గమనార్హం. సితార గురించి మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది.

సితార (Sitara) ఎంచుకునే యాడ్స్, ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సితార డ్యాన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సితార మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ సపోర్ట్ ఉంటే సితార రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus