Sitara, Mahesh Babu: సర్కారు వారి పాట.. పెన్నీ సాంగ్ ప్రోమోలు మెరిసిన మహేష్ కూతురు!’

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట కళావతి యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఆ పాట 100 మిలియన్ల వ్యూస్ ను కొట్టినా కొట్టొచ్చు.

ఇక రెండో సింగిల్ గా పెన్నీ అనే పాటని రేపు అంటే మార్చి 20 న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రోమోలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఈ పాటకి ఆమె చాలా యాక్టిివ్ గా చిందులు వేసింది.దీంతో మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాట మాత్రం కళావతి రేంజ్ లో లేదు. మీరు కూడా ఓ లుక్కేయండి:

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus