Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

లెజండ‌రీ తమిళ న‌టుడు శివాజీ గణేశన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. శివాజీ గణేశణన్‌, కమలా గణేశణ్ దంపతుల పెద్ద కుమార్తె శాంతి నారాయణస్వామి (71) అనారోగ్యంతో కన్నుమూశారు. శాంతి కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొన్ని సినిమాల నిర్మాణాల్లో భాగస్వామ్య మయ్యారు. శివాజీ గణేశన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘తంగపతకం’ ఆమె నిర్మాణంలోనే రూపొందడం గమనార్హం. అయితే ఆమె సినిమా రంగంలో ప్రత్యక్షంగా ఎక్కువ కాలం కొనసాగలేదు.

Shanthi Narayanaswami

శాంతి నారాయణస్వామికి సోదరి తన్మోళి, సోదరులు రామ్‌ కుమార్, ప్రభు ఉన్నారు. వీరిద్దరూ తమిళ సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రామ్‌ కుమార్‌ నిర్మాతగా కొన్ని సినిమా నిర్మించగా, ప్రభు నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. శివాజీ గణేశణ్ తన కుమార్తెపై ప్రేమకు గుర్తుగా చెన్నై అన్నా నగర్‌లోని ఓ థియేటర్‌కు శాంతి థియేటర్ అని పేరు పెట్టారు.

శాంతి నారాయణస్వామి మరణంతో శివాజీ గణేశన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా రంగ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. ఆమె అంత్యక్రియలు సోమ‌వారం నిర్వహించనున్నట్లు సమాచారం.

 మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus