Bigg Boss 7 Telugu: అశ్విని మదర్ హింట్ ఇచ్చిందా ? ఫ్యామిలీ మీట్ లో గందరగోళం..! అన్ సీన్ లో ఇదే జరిగింది..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తోంది. ఇందులో ఎమోషన్స్ తో పాటుగా హింట్స్ కూడా వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం సీజన్ లో రెండు బ్యాచ్ లు గట్టిగా తలపడుతున్న సంగతి తెలిసిందే. శివాజీ బ్యాచ్ వర్సెస్ సీరియల్ బ్యాచ్ ఇది బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సీజన్ ని ఒక రకంగా నిలబెట్టింది ఇదే. అయితే, ఇప్పుడు డాక్టర్ వేషంలో వచ్చిన శివాజీ పెద్దకొడుకు కెన్నీ చాలా విషయాలు శివాజీకి చెప్పాడు.

అన్ సీన్ లో చూసినవాళ్లకి ఇది బాగా అర్దమవుతుంది. శివాజీ వాళ్ల అబ్బాయి చాలాసేపు హౌస్ లో సందడి చేశాడు. అట్లాంటా వెళ్తున్నా స్టడీస్ కోసం అప్పటి వరకూ ఉంటానో లేదో అని వచ్చాను అన్నాడు. దీంతో శివాజీ ఎమోషనల్ అయిపోయాడు. బాగా ఏడుస్తుంటే., నువ్వు ఏడవకు నాన్నా నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తారు అంటూ మాట్లాడాడు. చాలా మెచ్యూర్ గా ఇంట్లో వాళ్లకి సమాధానాలు చెప్పాడు. అంతేకాదు, బయట జరిగేవన్నీ చెప్తుంటే శివాజీ తన కొడుతు చేతిని గోకుతూ ఇంక చాలా ఆపు అన్నట్లుగా సంకేతం ఇచ్చాడు.

ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అందరూ కూడా శివాజీ వాళ్ల అబ్బాయి శివాజీ చేతిని గోకి హింట్ ఇచ్చాడని వైరల్ చేస్తున్నారు. కానీ, శివాజీనే కొడుకు మాటలని కంట్రోల్ చేసేందుకు అలా చేశాడన్నమాట. హౌస్ లో నిన్ను ఎవ్వరూ రెచ్చగొట్టినా రెచ్చిపోకంటూ చెప్తున్నప్పుడు నేను జనాలకి ఉన్నన్ని రోజులు గుర్తుండేలా ఉంటారా అంటూ మాట్లాడాడు శివాజీ. నిజానికి ఇక్కడ అంతకంటే ఎక్కువ సజెషన్స్ వద్దు అన్నట్లుగా మాట్లాడాడు శివాజీ. నేను మీరు చెప్తే ఆడానా ? ఏంటి ? అని కూడా అన్నాడు. మాటలు జారుతున్నాయ్ జాగ్రత్త..

మనం ఊతపదాలు అనుకుంటాం కానీ అవి వేరేవాళ్లకి హర్ట్ అవుతాయ్ అని చెప్పాడు కెన్నీ గేమ్ ని అబ్జర్వ్ చేసి చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. ఆ తర్వాత కెప్టెన్ శోబా వచ్చి శివాజీ కొడుకుతో మాటలు కలిపింది. బయట ఏం జరుగుతోందో చెప్పమని అడిగింది. అలాగే, లాస్ట్ వీక్ మీ శివాజీ గేమ్ బాగుందా అని ఏదైనా హింట్ దొరుకుతుందేమో అని ట్ర్రై చేసింది. కానీ, కెన్నీ బాబు ఎక్కడా చిక్కలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఫ్యామిలీ మీట్స్ అప్పుడు ఏదో ఒకటి హైలెట్ (Bigg Boss 7 Telugu) అవుతూనే ఉంటాయ్. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus