Skanda: స్కంద సినిమాలో రామ్ సిస్టర్ రోల్ లో మెప్పించిన నటి ఎవరో తెలుసా?

  • October 3, 2023 / 05:19 PM IST

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ యావరేజ్ టాక్ తో రెండు రోజుల్లో 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్కంద సినిమా సెకండాఫ్ లో రామ్ చెల్లి పాత్రలో ఒక నటి కనిపించగా ఆ నటి ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఈ నటికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రామ్ చెల్లి పాత్రలో నటించిన ఈ నటి పేరు అమృతా చౌదరి అని సమాచారం. ఈ యువతి సొంతూరు భీమవరం అని తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అమృతను ఏకంగా 6,84,000 మంది ఫాలో అవుతున్నారు. బీటెక్ చదివిన అమృతా చౌదరి కాలేజ్ లో చదివే సమయంలోనే యాక్టింగ్ లో తన టాలెంట్ చూపించారని తెలుస్తోంది. పలు లఘు చిత్రాలతో పాటు కవర్ సాంగ్స్ లో నటించి ఈ బ్యూటీ మెప్పించారు.

గతంలో ద రాక్ స్టార్ అనే సినిమాలో అమృత నటించారని తెలుస్తోంది. (Skanda) స్కంద సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అమృతా చౌదరి పేరు మాత్రం మారుమ్రోగుతోంది. అమృతా చౌదరికి హీరోయిన్ గా ఆఫర్లు మరింత పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. మంచి ఆఫర్లు వస్తే బోల్డ్ సీన్స్ లో నటించడానికి కూడా సిద్ధమేనని ఆమె చెబుతున్నారు. అమృతా చౌదరి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

అమృతా చౌదరికి సరైన ఆఫర్లు వస్తే మాత్రం ఆమె ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమృతా చౌదరి రెమ్యునరేషన్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు ఫోకస్ చేస్తే మాత్రం అమృతా చౌదరి నటిగా కెరీర్ పరంగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అమృతా చౌదరిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus