Skanda: స్కంద సినిమాలో హీరోల పేర్లు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • October 9, 2023 / 11:25 AM IST

ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోని సినిమా ఏదనే ప్రశ్నకు స్కంద సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఈ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులకు ఈ సినిమాలోని హీరోల పాత్రల పేర్లు తెలియవు. ఈ సినిమాకు స్కంద అనే టైటిల్ ఫిక్స్ చేయడానికి కారణమేంటనే ప్రశ్నకు సైతం చాలామంది దగ్గర జవాబు ఉండదనే సంగతి తెలిసిందే. క్రిటిక్స్ సైతం రివ్యూలలో రామ్ పాత్ర పేరు ప్రస్తావించకుండానే రివ్యూలు రాయడం జరిగింది.

అయితే ఈ సినిమాలో రామ్ పాత్రల పేర్ల విషయానికి వస్తే కాలేజ్ లో చదువుకునే రామ్ పాత్ర పేరు రుద్రకంటి మణికంఠ భాస్కర రాజు కాగా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే మరో రామ్ పాత్ర పేరు రుద్రకంటి మణికంఠ స్కంద రాజు అని సమాచారం. హీరోయిన్ శ్రీలీల పేరు విషయానికి వస్తే ఆమె పోషించిన పాత్ర పేరు శ్రీలీల రెడ్డి అని బోగట్టా. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైన సమయంలో పెద్దోడు, చిన్నోడు పేర్లు ఏంటనే చర్చ జరగగా చాలాకాలం తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది.

స్కంద (Skanda) సినిమాకు సంబంధించి మాత్రం అలాంటి ప్రశ్నలకు వేగంగానే సమాధానం దొరికిందనే సంగతి తెలిసిందే. స్కంద సినిమాకు సీక్వెల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సూర్య, బన్నీ, మహేష్ బాబు, బాలయ్యతో తెరకెక్కనున్నాయి.

ఈ సినిమాలు పూర్తైన తర్వాతే బోయపాటి శ్రీను కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా బోయపాటి శ్రీను రేంజ్ పెరుగుతోంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus