సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన చాలా మంది నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జీవిత – రాజశేఖర్, శ్రీకాంత్ – ఊహ, నాగార్జున- అమల, సూర్య – జ్యోతిక, మహేష్ బాబు – నమ్రత,వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఈ సంస్కృతి సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో కూడా కొనసాగింది. జాకీ – హరిత.. వంటి చాలా మంది సీరియల్ నటీనటులు..
నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వీరిలానే మరో బుల్లితెర జంట కూడా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే..’అమ్మకు తెలియని కోయిలమ్మ’ అనే సీరియల్లో జంటగా నటించారు కావ్య శ్రీ – నిఖిల్. అలాగే వీళ్ళు ఓ వెబ్ సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇక బుల్లితెర పై ఈ జంట ఎప్పటికప్పుడు డాన్స్ పెర్ఫార్మన్స్..లు వంటివి ఇస్తూనే ఉన్నారు. దీంతో నిఖిల్ – కావ్యశ్రీ పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం ఎక్కువగా మొదలైంది.
ఈ విషయం పై (Nikhil)నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. ‘కావ్య వంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు. నా అదృష్టం నాకు అంత మంచి ఫ్రెండ్ దొరికింది. అంతేకాని ప్రేమ, గీమ, పెళ్లి వంటి ఆలోచనలు లేవు. మా ఇంట్లో కూడా నన్ను త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పట్లో దాని జోలికి వెళ్ళను” అంటూ క్లారిటీ ఇచ్చాడు
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!