Sobhita Dhulipala: సమంతపై ఊహించని కామెంట్స్ చేసిన శోభిత ధూళిపాళ్ల!

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా శోభిత ధూళిపాళ మరోసారి ప్రేమ మంటలు రగిలేలా నాగ చైతన్యపై కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు శోభిత.. నాగ చైతన్యతో కలసి తిరుగుతోంది అనే రూమర్స్ మాత్రమే వినిపించాయి.

వీళ్లిద్దరి పిక్స్ కూడా కొన్ని లీక్ అయ్యాయి. కానీ ఈ సారి ఏకంగా (Sobhita Dhulipala) శోభిత చైతు గురించి తన మనసులో మాట చెప్పింది. అతడిపై తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. యాంకర్ నాగ చైతన్య గురించి అడగగా నాగ చైతన్య ఎంతో మర్యాదస్తుడు. హుందాగా ఉండే వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించింది. చైతు చాలా కూల్ గాయ్. అది చైతూతో నాకు నచ్చే గుణం అంటూ శోభిత హాట్ కామెంట్స్ చేసింది. చైతు గురించి మాత్రమే కాదు.. అతడి మాజీ భార్య సమంత గురించి కూడా శోభిత ఊహించని కామెంట్స్ చేసింది.

ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో ఆమె బెస్ట్ ఛాయిస్. ప్రతి ప్రాజెక్టుని ఆమె ఎంచుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది అని శోభిత ప్రశంసించింది. ఆమె సినీ కెరీర్ చాలా గొప్పగా సాగుతోంది అని శోభిత తెలిపింది. శోభిత ఆల్రెడీ చైతుతో డేటింగ్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ప్రేమ మంటలు పుట్టించే విధంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం చైతు, శోభిత లండన్ లోని ఓ రెస్టారెంట్ లో మెరిసిన ఫోటో లీకై వైరల్ అయింది.

దీనితో వీరిద్దరి లవ్ ఎఫైర్ గురించి వార్తలు బలపడ్డాయి. కానీ ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్ పై చైతూ కానీ, శోభిత కానీ స్పందించలేదు. ఏది ఏమైనా వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చైతు సమంతని 2017లో వివాహం చేసుకోగా 2021లో విభేదాలతో విడిపోయి అందరికి షాకిచ్చారు. ఇదిలా ఉండగా శోభిత చివరగా పొన్నియిన్ సెల్వన్ 2లో వానతి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus