శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు తెలుగు నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. ఇలా ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని హీరో నాగచైతన్యతో ఈమె డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఇలా ఈ వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో వీరిద్దరూ కలిసి విదేశాలలో చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి వార్తలు నిజమేనని అయితే మీరు మాత్రం ఈ విషయంలో బయటపడటం లేదని తెలుస్తుంది. ఇలా తన వ్యక్తిగత విషయాల ద్వారా తరచు వార్తలు నిలుస్తున్నటువంటి ఈమె పలుమార్లు ఈ విషయంపై స్పందిస్తూ తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని తెలిపారు.
ఇకపోతే తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్నటువంటి శోభిత (Sobhita Dhulipala) అక్కడ ఈమె మాట్లాడుతూ తాను ఎలా హీరోయిన్ అయ్యారు. అలాగే ముంబై రావడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈమె స్వస్థలం వైజాగ్ కావడంతో తన చదువు మొత్తం వైజాగ్ లోనే పూర్తి చేశానని తెలిపారు. ఇలా చదువు మొత్తం పూర్తి అయిన తర్వాత తన ప్రయాణం బెంగుళూర్ లేదా ముంబై అని డిసైడ్ చేసుకున్నాను ఇలా ఒక పెద్ద సిటీలో తన కెరియర్ ప్రారంభించాలని అనుకున్నాను.
ఈ క్రమంలోనే కాయిన్ టాస్ వేశాను నాకు ముంబై అని రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ముంబై వెళ్ళిపోయానని శోభిత తెలిపారు.ఇలా ముంబై వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయిందని ఆ కాయిన్ నా జీవితాన్నే మార్చిందని ఈమె తెలిపారు. ఇలా తాను హీరోయిన్ అవ్వడానికి కూడా కారణం ఆ కాయిన్ టాస్ అంటూ శోభిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.