సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరోపక్క విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 24 ఏళ్లపాటు కలిసి జీవించిన సోహైల్-సీమాఖాన్ లు విడాకులు తీసుకుంటున్నారు.
ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ ఈ జంట పెళ్లి చేసుకుంది. అలాంటిది ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలకడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. విడాకుల వరకు రావడానికి గల కారణాలేంటనే విషయం తెలియరాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఓ ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఓ హీరోయిన్ అని టాక్. బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీతో సోహైల్ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడని వార్తలొస్తున్నాయి.
గతంలో ఇలాంటి వార్తలు రాగా.. సోహైల్ తనను అన్నలాంటి వాడని చెప్పింది హ్యూమా ఖురేషి. ఇప్పుడు సోహైల్ విడాకులు తీసుకుంటుండడంతో హ్యూమా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు హ్యూమా ఖురేషి స్పందించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలోనే కాకుండా.. సౌత్ లో కూడా సినిమాలు చేస్తోంది. చివరిగా అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో కనిపించింది. ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకొచ్చింది.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!