మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైనట్లు లాక్ డౌన్ లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జీ 5 వాళ్లు ఈ సినిమా హక్కులు తీసుకున్నారని.. ఈ సినిమాను మిగతా ఓటీటీ రిలీజ్ లకు భిన్నంగా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారని.. దీపావళి నాటికి సినిమా రిలీజ్ ఉంటుందని వార్తలొచ్చాయి. నెల కిందటే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ కొన్ని వారాలుగా ఈ సినిమా ఊసే లేదు.
దీపావళి నాటికి రిలీజ్ అవుతుందనుకుంటే.. తమ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు.. డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఓటీటీలో వస్తుందనుకున్న సినిమా థియేటర్లో అనేసరికి అంతా షాక్ అయ్యారు. దీంతో అసలు ఓటీటీ దిశగా అసలు ప్రయత్నాలు జరగలేదా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఓటీటీ విడుదల కోసం చర్చలు జరగడం, ఒప్పందానికి దగ్గరగా రావడం నిజమే కానీ అగ్రిమెంట్ మాత్రంకాలేదట . ముందు కరోనా కాలం కాబట్టి ఎంతోకొంతకి సినిమా ఇచ్చేయాలనుకున్నారు.
కానీ ఆ తరువాత ఆలోచనలు మారినట్లు తెలుస్తోంది. థియేటర్లు పునః ప్రారంభం కావడంతో మేకర్లలో ఆశలు చిగురించారు. తేజు నుండి వరుసగా రెండు హిట్ల తరువాత వస్తోన్న సినిమా కావడం, అవుట్ పుట్ కూడా బాగుందనే కాన్ఫిడెన్స్ ఉండడంతో.. థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?