సో .. హాట్ సోనాక్షి

హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండి తెరపై కనిపించిన ఈ భామ చీరకట్టుతో విజయం అందుకుంది. ఆ తర్వాత స్కిన్ షో కి దూరంగా అనేక సినిమాలు చేసి తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగ దాస్ తో అకిరా అనే సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం మౌన గురు కు రీమేక్ అయినా ఇందులో సోనా లీడ్ రోల్ పోషిస్తోంది. అందుకు తగ్గట్టు కష్టపడుతోంది. డూపులు ఎవరిని పెట్టుకోకుండా యాక్షన్ సీన్లలో నటిస్తోంది. గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటోంది.

సెప్టెంబర్ 2 న రిలీజ్ కానున్న ఈ సినిమా పై సోనాక్షి ఆశలు పెట్టుకుంది. రెండేళ్లుగా ఈ సుందరికి గొప్ప విజయాలు లేవు. అందుకే హిట్ కోసం శ్రమిస్తోంది. ఇప్పటి నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇందుకోసం గ్లామర్ గా ఫోటో షూట్ లో ఫోజులు ఇస్తోంది. వివిధ మాగజైన్లపై హాట్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ గా మ్యాన్స్‌ వరల్డ్‌ అనే మ్యాగజైన్‌ కోసం ఇచ్చిన స్టిల్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సోనా బ్లాక్ సూట్ లో క్లీవేజ్‌ కనిపించేలా ఉన్నఫోటో భలే ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండే ఈ సుందరి అందాలు ఆరబోయడం పై బాలీవుడ్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అవకాశాలు తగ్గి పోవడంతో సోనా హాట్ బాట పట్టిందని కొందరు విమర్శిస్తుండగా… రొటీన్ కు భిన్నంగా న్యూ లుక్ తో కనిపించేందుకు సోనాక్షి ప్రయత్నిస్తోందని అభిమానులు సమర్ధిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus