Sonam Kapoor: ప్రెగ్నెన్సీపై సోనమ్‌ సోషల్‌ పోస్ట్‌ వైరల్‌!

బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతగా ఏం రాసుకొచ్చింది అంటారా? ఆమె ఇప్పుడు గర్భవతి అని తెలిసిందే. అందుకే ప్రెగ్రెన్సీ పరిస్థితులు, ఆ సమయంలో వచ్చే సమస్యలు, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి సోషల్‌ మీడియా పోస్ట్‌ పెట్టింది. అందులోని వివరాలు ఆసక్తికరంగా ఉండటంతో నెటిజన్లు దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందో మీరే చదవండి. తను గర్భవతిని అంటూ సోనమ్‌కపూర్‌ మార్చిలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

త్వరలో ఆమె డెలివరీ ఉంటుంది. దీని కోసం ఆమె ఎప్పుడో విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో సోనమ్ తన ప్రెగ్నెన్సీ కష్టాలను చెప్పుకొస్తూ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. గర్భం దాల్చడంతో మహిళ జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి, బిడ్డను కనే వరకు ఎన్ని కష్టాలు పడాలో ఆడవాళ్లకు తెలుసు అంటూ ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఆమె చెప్పిన వివరాలు అర్థమయ్యేందుకు వీలుగా, ఓ ఫోటోను కూడా షేర్ చేసింది.

తల్లి అవ్వడం అంత సులభమైన పని కాదు. ఎన్నో కష్టాలు దాటాల్సి వస్తుంది అంటూ ఈ సమయంలో తన కాళ్లు ఎంతగా వాచిపోయాయో చూపిస్తూ ఓ ఫొటో షేర్‌ చేసింది సోనమ్‌. హీరోయిన్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాను 2018లో సోనమ్‌ కపూర్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా పేరున్న సోనమ్‌ పెళ్లి తరువాత కూడా సోనమ్ కొన్ని సినిమాల్లో నటించింది.

బోల్డ్‌నెస్‌, హాట్‌నెస్‌ పెళ్లి తర్వాత కూడా ఎక్కడా తగ్గించేలేదు. ఎవరి ఈవెంట్‌ అయినా తన ప్రజెన్స్‌ స్పెషల్‌గా ఉండేలా డ్రెస్సింగ్‌ చూసుకునేది. గర్భవతి అయ్యాక ఆమె సందడి అంతా సోషల్‌ మీడియాకే పరిమితమైపోయింది. స్పెషల్‌ ఫొటోషూట్‌లతో బిజీగా ఉంటూ వస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె, తండ్రి అనిల్‌ కపూర్‌ల మాటలు కూడా ఆసక్తికరంగా ఉంటూ ఉంటాయి. వారి ఫొటోలు, ట్వీట్లు, రిప్లైల లెక్కే వేరు. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి ఆమె సోషల్‌ మీడియా ఖాతాని.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus