Sonam Kapoor: సోనమ్ కపూర్ తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని ఎన్ని కోట్లకు అమ్మిందంటే..?

బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ గురించి ఆడియన్స్‌కి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. అనిల్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్ సినిమాల్లో డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను మెప్పించారామె. ఆనంద్ అహూజాతో పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించేశారు.ఇప్పుడు ముంబైలోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అమ్మేసి వార్తల్లో నిలిచారు సోనమ్. దీని గురించి బాలీవుడ్ మీడియా వర్గాలు ఆసక్తికర కథనాలు ప్రచురించాయి.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని BKCలో సోనమ్ కపూర్ అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తులో 5,533 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా కలిగి ఉంది. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సమీపంలోని ఉంది. నాలుగు కార్ పార్కింగ్ స్లాట్‌లు ఉండడం దీని ప్రత్యేకత..సోనమ్ అపార్ట్‌మెంట్‌ను SMF ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. దీని లావాదేవీకి 1.95 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డిసెంబర్ 29, 2022న రిజిస్టర్ చేయబడ్డాయి.

అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. సోనమ్ కపూర్ 2015లో ఈ అపార్ట్‌మెంట్‌ సుమారు రూ. 17 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తను కొన్న దానికి మరో రూ. 15 కోట్లు పెంచి రూ.32 కోట్లకు అమ్మేయడం విశేషం. ఈ అపార్ట్‌మెంట్ ప్రత్యేకత ఏంటంటే సముద్రపు వీక్షణ కలిగి ఉండడం..

ఇక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ, సిగ్నేచర్ కన్సైర్జ్ సర్వీస్, ఇండోర్ ఉష్ణోగ్రత-నియంత్రిత స్విమ్మింగ్ పూల్, హెల్త్ క్లబ్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జిమ్, మినీ థియేటర్ మరియు మల్టీపర్పస్ హాల్‌తో అత్యంత అద్భుతంగా నిర్మించబడింది. 2018లో ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకున్న సోనమ్ 2022లో బాబుకి జన్మనిచ్చారు. ప్రస్తుతం వీరు లండన్‌లో నివసిస్తున్నారు. అక్కడే స్థిరపడిపోవాలనే ఉద్దేశంతోనే ఆమె ముంబైలోని ఈ అపార్ట్‌మెంట్‌ని అమ్మేశారని బాలీవుడ్ వర్గాలవారి సమాచారం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus