‘హలో ‘ అంటూ మొదలై ఆకట్టుకున్న పాటలు

  • December 21, 2017 / 01:11 PM IST

సినిమా.. కోట్లతో ముడిపడి ఉన్న బిజినెస్. అందుకే ప్రతిదీ అలోచించి చేయాల్సి ఉంటుంది. హీరో, హీరోయిన్ కాంబినేషన్, టైటిల్లో అక్షరాలు.. హిట్ ఇచ్చిన లొకేషన్స్.. ఇలా కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవ్వడంతో తప్పులేదని పిస్తోంది. తాజగా అఖిల్ నటించిన ‘హలో’ మూవీకి ఈ టైటిల్ కి సెంటిమెంట్ ప్రకారమే పెట్టారా? అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పేరుతో ఇదివరకు వచ్చిన పాటలు.. సినిమాలు హిట్ అయ్యాయి. ప్రత్యేకంగా అక్కినేని కుటుంబానికి హలో అచ్చోచిన మాట. పాట. ఏంటి నమ్మడం లేదా? అయితే ఓ సారి ఈ ఆర్టికల్ చదవండి మీకే తెలుస్తుంది.

హలో హలో ఓ అమ్మాయి ….

అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు మిత్రులు సినిమాలో “హలో హలో ఓ అమ్మాయి …” పాట 1961 లో అప్పుడు అందరి నోటిలో నానింది. ఇందుకు ఆరుద్ర సాహిత్యం అందించగా సాలూరి రాజేశ్వర రావు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఘంటసాల, సుశీల గాత్రంతో సూపర్ హిట్ పాటగా నిలిచింది.

హలో గురు ప్రేమ కోసమే రోయి జీవితం…

నాగార్జున హిట్ చిత్రాల్లో నిర్ణయం ఒకటి. ఈ చిత్రం కోసం ఇళయరాజా ఇచ్చిన స్వరాలూ యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఇందులో ఎస్ పీ బాలు పాడిన “హలో గురు ప్రేమ కోసమే రోయి జీవితం…” పాట ప్రేమికుల జపం అయింది.

హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యాయే

ప్రేమదేశం .. ఓ సంచలన హిట్. ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు ఉర్రూతలూగించాయి. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యాయే అనే పాట ఇప్పటికీ కాలేజీ వార్షికోత్సవంలో వినిపిస్తూనే ఉంటుంది.

హల్లో హల్లో ఐ వాంట్ యువర్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేష్ ధర్మచక్రంలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి ఎం. ఎం. శ్రీలేఖ ఇచ్చిన సాంగ్స్ మంచి బలాన్నిచ్చాయి. ముఖ్యంగా చంద్రబోస్ రాసిన “హెల్లొ హెల్లొ ఐ వాంట్ యువర్ ఇంటర్వ్యూ” అనే పాట అందరికీ నచ్చింది.

హల్లో హల్లో ఏ మాట చెప్పక ఓ పిల్లో …

హల్లో అనేమాట మంత్రం పవర్ కలిసిందేమో నానికి భలే భలే మగాడివోయ్ మూవీ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇందులోని అన్ని పాటలను మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. హల్లో హల్లో ఏ మాట చెప్పక ఓ పిల్లో …మాత్రం ఫీల్, బీట్ కలిపి ఇచ్చి హిట్ అందుకున్నారు.

హలో హలో లైలా …

దడ సినిమా నాగచైతన్యకి నిరాశపరిచినప్పటికీ ఇందులోని “హలో హలో లైలా …” పాట రొమాంటిక్ గా ప్రేమికుల మనసుదోచుకుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హలో మాటతో మ్యాజిక్ చేశారు.

హలో .. ఎవ్వరో ఎవ్వరో…

వెంకటేష్ బాడీగార్డ్ మూవీలో హలో .. అనే పిలుపుతో ఎవ్వరో ఎవ్వరో…పాట మొదలవుతుంది. ఎస్. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కి కార్తీక్ స్వరం కలిసి ఈ పాట హిట్ సాంగ్స్ జాబితాలో చేరింది.

హలో రమ్మంటే వచ్చేసిందా …

రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా ఆడియో సూపర్ హిట్. హరీష్ జయరాజ్ స్వరపరిచిన ఆరంజ్ పాటల్లో “హలో రమ్మంటే వచ్చేసిందా …” చాలా బాగుంటుంది.

హలో రాక్ స్టార్ ..

మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించిన వన్ నేనొక్కడినే లో “హలో రాక్ స్టార్..” .. సాంగ్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హలో మైక్ టెస్టింగ్

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చెప్పగానే అందరికీ పక్కా లోకల్ పాట గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్ “హలో మైక్ టెస్టింగ్ ..” అనే పదాలతోనే మొదలై దుమ్మురేపింది. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ కి గీత మాధురి తన గొంతు మరింత ఊపు తెచ్చింది.

హలో.. ఎక్కడున్నా హలో…

ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా టైటిల్ నే “హలో” గా ఫిక్స్ చేస్తారు. ఇందులో “హలో.. ఎక్కడున్నా హలో…” అనే టైటిల్ సాంగ్ సైలెంట్ కిల్లర్ లా మనసుకు హత్తుకుంటోంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఈ పాట ఎక్కువమంది కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నారు. దీంతో సినిమా కంటే ముందుగానే టైటిల్ సాంగ్ హిట్ అయింది. ఇంకా సినిమా హిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. హలో మూవీ ఫలితం మరో కొన్ని రోజుల్లో తెలియనుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus