Sonusood: మరో ఇండియన్ క్రికెటర్‌కు అడగ్గానే సహాయం!

  • May 13, 2021 / 01:24 PM IST

వెండితెర విలన్ సోనూసూద్ నిజజీవితంలో మాత్రం తన మంచితనంతో పవర్ఫుల్ హీరోగా మారుతున్నాడు. సహాయం కోసం ఎంతమంది వచ్చినా కూడా తగ్గడం లేదు. వీలైనంత వరకు అడిగిన ప్రతి వారికి లేదనకుండా సహాయం చేస్తున్నాడు. దేశం ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉండగా సెలబ్రెటీలు కూడా తోటి వారికి సరైన సమయంలో సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ దెబ్బకు టాప్ మోస్ట్ సెలబ్రెటీ బంధువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక మొన్న టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తన బంధువు మహిళకు ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరం అంటే నిమిషాల్లో స్పందించిన సోనూసూద్ ప్రాణాలు కాపాడాడు. ఇక మరో ఇంటర్నేషనల్ సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఒకరికి ఒక రెమ్డేసివర్ ఇంజెక్షన్ కావాలని అడ్రస్ తో సహా పొందుపరిచి ట్విట్టర్ ద్వారా సహాయం కోరిన కొద్దిసేపటికే సోనూసూద్ స్పందించాడు. అభిమానులు చాల వరకు సోనూసూద్ ను ట్యాగ్ చేయడంతో పైనైపోయినట్లే..

భాజి అంటూ సోనూసూద్ ఆన్సర్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సోనూసూద్ తన సహాయలను మరింత విస్తృతం చేస్తున్నాడు. ఇక త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్స్ ను నిర్మించి వీలైనంత ఎక్కువమంది ప్రాణాలను కాపాడాలని సోనూసూద్ టార్గెట్ గా పెట్టుకున్నాడు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus