Sonu Sood: వైరల్ అవుతోన్న సోనూసూద్ కార్టూన్!

  • May 8, 2021 / 03:31 PM IST

వెండితెరపై విలన్ వేషాలు వేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. గతేడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినప్పటి నుండి అతను చేస్తోన్న సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన దగ్గర వనరులు అయిపోయినా కూడా ఫండ్స్ సేకరిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వాలు కూడా చేయలేని స్థాయిలో కోవిడ్ బాధితులను, ఇతర అభాగ్యులను ఆడుకుంటున్నాడు. రోజూ దేశవ్యాప్తంగా అతడికి వేలల్లో వినతులు అందుతున్నాయి.

హాస్పిటల్ లో బెడ్ కోసం, వెంటిలేటర్ల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం, మెడిసిన్స్ కోసం ఆయనకు రిక్వెస్ట్ లు పంపిస్తూనే ఉన్నారు. అందులో తన టీమ్ ద్వారా వీలైనంత మందికి సాయం అందించగలుగుతున్నాడు. సోనూ నుండి సాయం పొందుతున్న వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అతడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో చాలా మంది కార్టూనిస్ట్ లు సోనూ సేవలను ఉద్దేశిస్తూ పలు రకాల కార్టూన్స్ ను డిజైన్ చేస్తున్నారు.

తాజాగా సోనూకి సంబంధించిన ఓ కార్టూన్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ సడెన్ గా ఆగిపోవడంతో స్వదేశానికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్ లు తమను ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేయమని సోనూకి రిక్వెస్ట్ పెడుతున్నట్లుగా ఉంది. సోనూని ట్యాగ్ చేస్తూ ఈ కార్టూన్ ని షేర్ చేయగా.. వెంటనే బ్యాగులు సర్దుకోండి.. ఇంటికి పంపిస్తా అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు సోనూ. ఈ కార్టూన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus