బాలీవుడ్ లో జోరందుకున్న బయోపిక్స్

‘డర్టీ పిక్చర్’ ‘ఎం. ఎస్.ధోని’ ‘సంజు’ చిత్రాలతో బాలీవుడ్ లో బయోపిక్ ల హవా మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలు అక్కడ మంచి ఫలితాలనే సాధించాయి. ఈ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపంచాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు జరుకుపుకుంటుంది.

అయితే సోనూసూద్ కూడా ఒక బయోపిక్ నిర్మించే పనిలో ఉన్నాడంట. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి సోనూసూద్ రెడీ అవుతున్నట్టు సమాచారం. విలన్ రోల్స్ తోనే తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో సోనూసూద్ కు మంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. చిన్నతనం నుండీ నుంచి ఒలంపిక్ మెడల్ సాధించేవరకూ పీవీ సింధు ఎదుర్కొన్న పరిస్థుతుల నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం పీవీ సింధు పాత్రకు సరిపడే నటి కోసం సోనూ వెతుకుతున్నాడు. ఇక కోచ్ పుల్లెల గోపీచంద్ స్వయంగా సోనూ సూద్ పోషించడానికి సిద్ధం అవుతున్నాడు. మరో పక్క మన టాలీవుడ్ లో కూడా పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పుల్లెల గోపీచంద్ పాత్రలో మహేష్ బావమరిది సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఈ పాత్రలో మెప్పిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus