గాయనీ గాయకులు ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చల్లటి పదార్థాలు వాళ్ళు దూరమే. కొంతమంది బరువు పెరుగుతామని వేపుడు పదార్థాలు కూడా తినరు. కానీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అటువంటి నిమయాలు ఏవీ పెట్టుకోలేదు. ఆయన భోజన శైలి గురించి ఎవరు చెప్పినా నచ్చింది తినేవారని చెబుతున్నారు. ఏం తిన్నా ఆయన గొంతు చెక్కుచెదరలేదని, భగవంతుడు ఆయనకు ఇచ్చిన వరమని అంటున్నారు. అటువంటి బాలు భోజనశైలి బేరియాట్రిక్ సర్జరీ తరవాత మారింది.
ఒక దశలో బరువు బాగా పెరిగిన బాలు భారీకాయంతో కనిపించారు. కొన్నాళ్ల తరవాత ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని సన్నబడ్డారు. ఆ సర్జరీ తరవాత ఆహారం పూర్తిగా తగ్గించారు. ఎవరైనా ప్రేమతో వండి పెట్టిన పదార్థాలు డైనింగ్ టేబుల్ మీద ఎన్ని ఉన్నప్పటికీ పూటకి రెండు గరిటెల కంటే ఎక్కువ తినలేదు. కంప్లీట్ డైట్ పాటించారు. మరో విషయం ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ తరవాత పచ్చి కాయగూరలు తినడం ప్రారంభించారు.
బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తరవాతే తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన ‘మిథునం’లో బాలు యాక్ట్ చేశారు. వావిలవలసలో ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ మధ్యాహ్నం బ్రేక్ టైమ్ లో తోటలో బెండకాయ కోసుకుని, పచ్చిది తిన్నారని భరణి చెప్పారు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని చుట్టుపక్కల వాళ్ళతో చెబుతూ ఉండేవారట.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!