Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Reviews » SPARK Review in Telugu: స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

SPARK Review in Telugu: స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 17, 2023 / 05:19 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
SPARK Review in Telugu: స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్రాంత్ రెడ్డి (Hero)
  • మెహరీన్ కౌర్ పిర్జాదా (Heroine)
  • రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు (Cast)
  • డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ (Director)
  • లీలా రెడ్డి (Producer)
  • హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Music)
  • ఏ ఆర్ అశోక్ కుమార్ (Cinematography)
  • Release Date : నవంబర్ 17, 2023
  • డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ (Banner)

దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించింది లేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అవి పెద్దగా సందడి చేసింది లేదు. దీంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై జనాల ఫోకస్ పడింది. ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ‘స్పార్క్’ అనే మూవీ పై కూడా జనాల ఫోకస్ పడింది. ఎందుకంటే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం అందం’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. టీజర్, ట్రైలర్…లు కూడా చాలా కొత్తగా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: లేఖ(మెహరీన్) కి నిత్యం ఓ కల వస్తూ ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె భావిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలు వద్దు అని క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి అతన్ని వెతికే పనిలో పడుతుంది. ఓ హాస్పిటల్ లో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతను మరెవరో కాదు తన ఎదురింట్లో ఉంటున్న ఆర్య (విక్రాంత్ రెడ్డి) అని తెలుస్తుంది. ఈ క్రమంలో అతనికి తన ప్రేమ గురించి చెప్పగా.. అతను రిజెక్ట్ చేస్తాడు. మరోపక్క లేఖ స్నేహితులు ఊహించని విధంగా తమకి అయిన వాళ్ళని చంపేసుకుని..

తరువాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అయితే ఈ చావులకి కారణం హీరో అని లేఖ తండ్రి ఆరోపిస్తాడు.అలాగే పోలీసులు కూడా ఇతని కోసం గాలిస్తూ ఉంటారు. నిజంగా ఆర్య ఈ మర్డర్స్ చేశాడా? లేదంటే వారిని చంపింది దెయ్యమా? అసలు ఆర్య గతం ఏంటి? అసలు అతని ప్రియురాలు అనన్య(రుక్సార్ ధిల్లాన్) ఏమైంది? చివరికి ఆర్య ఈ మర్డర్ కేసుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: డెబ్యూ మూవీ అయినప్పటికీ విక్రాంత్ చాలా బాగా నటించాడు. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలు పోషించడమే కాకుండా… ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు.ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంటే మాటలు కాదు. అతనికి అన్ని విధాలుగా ఫుల్ మర్క్స్ పడతాయి. ఇక మెహరీన్ స్క్రీన్ పై అందంగా కనిపించింది. పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక రుక్సర్ ధిల్లాన్ .. అనన్య పాత్రలో చాలా చక్కగా నటించింది.

ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కథలో కీలక పాత్ర ఆమెదే అని చెప్పాలి. ఇక విలన్ గా చేసిన గురు సోమసుందరం పాత్ర అయితే చాలా స్టైలిష్ గా అలాగే ఎంటర్టైనింగ్ గా ఉంది. అలాగే నాజర్, అన్నపూర్ణ, సుహాసిని, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్,సత్య .. అక్కడక్కడ నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు ఓకే.

సాంకేంతిక నిపుణుల పనితీరు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘స్పార్క్’ కి అన్నీ తానై చేశాడు విక్రాంత్ రెడ్డి. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా కొత్తగా.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత మంచి పాయింట్ ను ఎంపిక చేసుకున్నా.. దానిని తెరపై ఆవిష్కరించే టైంలో చాలా మంది తడబడతారు. కానీ విక్రాంత్ అలాంటి పొరపాటు చేయలేదు. ఎన్నేళ్లు అతను ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాడో తెలీదు కానీ.. పక్కాగా ఈ కథని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది.

హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. పాటలు వినడానికి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి పేరు పెట్టనవసరం లేదు. సెకండ్ హాఫ్ లో విక్రాంత్ – మెహరీన్..ల మధ్య వచ్చే డ్యూయెట్.. కన్నుల విందుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో లీలా రెడ్డి ఎక్కడా రాజీపడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది.

విశ్లేషణ: కొత్త పాయింట్, ఆకట్టుకునే కథనం, ట్విస్ట్…లతో… ఈ (Spark) ‘స్పార్క్’ ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచుతుంది. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్స్ లో చూడదగ్గ సినిమా.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #spark

Reviews

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

2 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 hours ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

3 hours ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

3 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

15 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version