Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సమంతా సదా మీ సేవలో..

సమంతా సదా మీ సేవలో..

  • April 28, 2016 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతా సదా మీ సేవలో..

‘వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్.. బట్, వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్’ ప్రత్యూష ఫౌండేషన్ బ్రోచర్‌పై ఉన్న కొటేషన్. సమంత మనసులోని మాటకు అక్షర రూపం ఇది. ‘ఉన్నదాంతో మనం బతకగలం. కానీ మనం ఇచ్చిన దాంతో ఎదుటి వారి జీవితాలను నిలబెట్టగలం’ అని సమంత చెప్పే మాటలు చేతల్లోకి మారి ఏడాది కావొస్తోంది. మహిళలకు, పిల్లలకు ఎన్నో రకాల సేవలను అందించింది ప్రత్యూష ఫౌండేషన్. గతేడాది సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఆ మనసును తొలచిన ఆలోచనలే ఆమెను సేవామార్గం వైపు అడుగులు వేయించారు. ‘అన్నీ ఉన్నా.. మనిషి ఆరోగ్యం కుదుటపడాలంటే కాస్త ప్రేమ కావాలి. కానీ పేదవారికి ప్రేమతో పాటు డబ్బు ఉండాలి.. ఆదరణ చూపాలి’.. సమంత మదిలో మెదిలిన ఈ ఆలోచనలే ‘ప్రత్యూష ఫౌండేషన్’ టాగ్‌లైన్… సపోర్ట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.Samantha Prathyusha Foundation pICసమంత.. సింగిల్ కాల్షీట్ కూడా ఖాళీ లేని బిజీ హీరోయిన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటారంతా. సమంత మాత్రం తన ఇంటినే కాదు.. ఎందరి జీవితాలనో చక్కబెట్టాలని సంకల్పించింది. అందుకే రిటైర్ అయ్యాక మదిని తొలిచే సామాజిక సేవ.. సమంత మదిలో మెదిలింది. ‘సంపాదన ఎంత ముఖ్యమో.. సేవ కూడా అంతే ముఖ్యమని’ కదిలింది. తన ఆలోచనకు ‘ప్రత్యూష ఫౌండేషన్’ అని నామకరణం చేసి రంగంలోకి దూకింది. అంతే వేగంగా ‘ఆక్షన్’ పేరుతో మిగతా సెలిబ్రిటీలనూ అందులో భాగస్వాముల్ని చేసింది. ‘నేను ఎప్పటికీ హీరోయిన్‌గా ఉండలేను..! కానీ సమాజం దృష్టిలో మాత్రం సేవకురాలిగా ఎప్పటికీ నిలిచిపోవాలన్నది నా కోరిక’ అని చెప్పే ఈ కథానాయిక తీరిక కుదిరితే చాలు.. ప్రత్యూష ఫౌండేషన్ పనుల్లో బిజీ అవుతోంది.Samantha

రియల్ టార్గెట్..
చదువు.. ఆపై ఉద్యోగం.. లైఫ్ సెటిల్‌మెంట్.. ఈ టార్గెట్‌పై దృష్టి పెట్టిన యూత్ లైఫ్ బిజీ అయిపోయిందని ఫిక్సయిపోయింది. అలాంటి వారికి తీరిక కుదరని షెడ్యూల్‌లో ఓపిక కూడదీసుకుని సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పటి యూత్ ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు ప్రత్యూష ఫౌండేషన్ కో-ఫౌండర్ డాక్టర్ మంజుల. ‘హీరోయిన్‌గా సమంత అందరికీ తెలుసు. కానీ ఏడాదిగా ఆమె చేస్తున్న సేవను అభినందిస్తున్నాను. సమంతతో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమెన్ హెల్త్‌పై అవగాహన తరగతుల ఏర్పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు సేకరించి వారికి వైద్యం చేయించడం, వీటితో పాటు మహిళా సాధికారికత కోసం కార్యక్రమాలెన్నో ఈ సంస్థ ద్వారా చేయుగలిగాం. మధ్యలో సమంతకు వచ్చిన ‘మేక్ ఎ విష్’ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది’ అని వివరించారు డాక్టర్ మంజలా అనగాని.Samantha Social Servicesబ్లడ్ డొనేషన్ క్యాంప్స్..
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తలసేమియా బాధితులకు రక్తం అందించే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. సమంత ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, లివ్‌లైఫ్ ఆస్పత్రుల సాయంతో చేసే హెల్త్ క్యాంపెయిన్‌లకు కూడా పెద్ద ఎత్తున బాధితులు తరలి వస్తున్నారు. ఇక్కడ పది మందికీ చేయూతనిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ సేవలను చెన్నైకి కూడా విస్తరింపజేయాలని సమంత కోరుకుంటున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.Samantha, Prathyusha Blood Donation Camp“మనమిచ్చే కొంత వాళ్లకు అంతా” అంటూ సేవకు భాష్యం చెబుతుంది సమంతా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు… తనకున్నది అంతా ఇచ్చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది. ఎదుటివారి కళ్లల్లో సంతోషాన్ని చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై సోయగాలతో మతిపోగొట్టే సమంత.. సమాజంలో మంచి వ్యక్తిగా మన్ననలందుకుంటోన్న సమంతా.Samantha, Prathyusha Foundation

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prathyusha Foundation
  • #Samantha
  • #Samantha Movies

Also Read

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

related news

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

38 mins ago
Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

49 mins ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

1 hour ago
Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

15 hours ago
Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

15 hours ago

latest news

Dil Raju: ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

Dil Raju: ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

13 mins ago
Tejeswini: బాలయ్య కూతురా? మజాకా?అదరగొట్టేసింది.. తేజస్విని యాడ్ వీడియో వైరల్!

Tejeswini: బాలయ్య కూతురా? మజాకా?అదరగొట్టేసింది.. తేజస్విని యాడ్ వీడియో వైరల్!

16 mins ago
Sai Durgha Tej: ఫ్లాప్‌ సీక్వెల్‌పై ‘మనసు’పడ్డ సాయితేజ్‌.. ఆ దర్శకుడికి ఓకే చెప్పాడా?

Sai Durgha Tej: ఫ్లాప్‌ సీక్వెల్‌పై ‘మనసు’పడ్డ సాయితేజ్‌.. ఆ దర్శకుడికి ఓకే చెప్పాడా?

23 mins ago
Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

18 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version