అవును…ఆయన చరిత్రకొక్కడు…
చరిత్ర అన్న పదానికి చిహ్నంగా నిలిచిన నాయకుడు…
నట జీవితాన్ని ప్రజా జీవితం కోసం అర్పించిన నవ నాయకుడు…
ప్రజా సంక్షేమం కోసం కుభేరుడే…కుచేలుడుగా….మారిన ఆదర్శ నాయకుడు….
చైతన్య రధమెక్కి చరిత్ర సృష్టించిన ప్రజా నాయకుడు…
రాజకీయ శూన్యతను రూపు మాపి, తెలుగు వారి జీవితాల్లో వెలుగు నింపిన మన జననాయకుడు….
సంక్షేమ పధకాలకు తారక మంత్రంగా…రాజకీయ రణ క్షేత్రంలో ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపంగా….తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ఊపిరి పోసిన నవరస కధానాయకుడు….
తన మాటే ఒక శాసనంగా…ఆయన చూపిన బాటే తెలుగు వారి భవిష్యత్తుకు మార్గంగా తీర్చిదిద్దిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రాముడు…
ఈనాడు భూతికంగా ఆయన మన మధ్య లేకపోయినా….ఆయన నటన…ఆయన పాలన..ఆయన మాట..ఆయన బాట…అన్నీ వెరసి….అప్పటికీ, ఇప్పటికీ…ఎప్పటికీ…తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు.
పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేనప్పుడు, మనకెందుకు ఈ అధికారం అన్న ఆలోచనకు ప్రాణం పోసి, పేదవాడి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఆరాధ్య దైవం ఆయన…
ఆడపడుచులకు ఆస్తి హక్కు, స్త్రీ అనే పదానికి గౌరవాన్ని పెంచి, ఆడపడుచులకు అన్నగా, ఆయనే ఒక అండగా నిలిచిన మహోన్నత శక్తి ఆయన… కొన్ని వందల ఏళ్లుగా కూరుకుపోయిన కరణం వ్యవస్తను కూకటి వేళ్ళతో పెకిలించి, పేదవాడికి భూములు పంచిన నాయకుడు ఆయన…
ఇలా ఒక్కటి కాదు…ఎన్నో సంచలనాలకు చిహ్నంగా మారిని, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిన ఆరాధ్య దైవం…
క్లుప్తంగా చెప్పాలి అంటే….అన్నా…
తెలుగు జాతి ఆత్మ గౌరవం మాకు నువ్విచ్చిన వరం…
డీల్లీ పీటాన్ని వణికించిన నీ ధైర్యమే మాకు కొండంత బలం…
రాజకీయ కురుక్షేత్రంలో నువ్వు అన్న పదమే ఒక ప్రభంజనం…
నాటి..నేటి పాలకులకు….నీ ప్రజాహిత పాలనే ఆదర్శం….
అప్పుడు…ఇప్పుడు…ఎల్లప్పుడు… మీరు చూపిన బాటలోనే మా పయనం…