సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో.. విలన్లూ అంతే స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే హీరోయిన్లు ఎంత అందంగా, స్ట్రాంగ్‌గా ఉంటారో.. సెకండ్ హీరోయిన్లు / కీలక పాత్రలో నటించిన హీరోయిన్లు కూడా అంతే అందంగా, అంతే పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో జియా శర్మ, ‘యానిమల్’ చిత్రంలో త్రిప్తి డిమ్రి ఇలా వచ్చినవారే.
ఇప్పుడు ‘స్పిరిట్’ అంటూ ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రి లుక్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ లుక్‌ను రివీల్ చేశారు. ప్రభాస్ లుక్‌కి త్రిప్తి లుక్ ఆఫర్‌లో ఇచ్చినట్లు.. వివేక్ లుక్‌కి ఐశ్వర్యా దేశాయ్ లుక్‌ని ఆఫర్‌లో ఇచ్చారు. దీంతో ఎవరీ ఐశ్వర్య అంటూ యువత సెర్చింగ్ మొదలెట్టేశారు.
ఐశ్వర్యా దేశాయ్ ఇండియన్ – అమెరికన్ మోడల్. యూఎస్‌ఏలోని మేరీల్యాండ్‌లో మార్కెటింగ్ డిగ్రీ చేసి ఆ తర్వాత మోడలింగ్‌లో సెటిల్ అయ్యింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘గల్లీ బాయ్’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాతో విలన్‌కి హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్ ఇలా వచ్చిందో లేదో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఊపొచ్చింది. ఫాలోవర్ల సంఖ్య పెరిగింది.
నిజానికి వివేక్ ఒబెరాయ్ పోస్టర్ చూసి.. దిగువ ఉన్న అమ్మాయి త్రిప్తినే అనుకున్నారు చాలామంది. అయితే ఆమె త్రిప్తి కాదని.. ఐశ్వర్య దేశాయ్ అని తర్వాత తేలింది. దీంతో ఈమెవరు అంటూ వెతకడం స్టార్ట్ చేశారు. ‘యానిమల్’ సినిమాలో మూవీలో ఓ సీన్‌లో నగ్నంగా నటించి, నేషనల్ క్రష్‌గా మారిపోయింది త్రిప్తి. మరిప్పుడు ఐశ్వర్య దేశాయ్ ఎలాంటి రియాక్షన్స్ రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఈ విషయం తేలాలంటే ఓ సంవత్సరం పడుతుంది. వచ్చే ఏడాది మార్చి 7న సినిమా రిలీజ్ అవుతుంది.