SPY Movie: నిఖిల్ స్పై ట్రైలర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

యంగ్ హీరో నిఖిల్ ‘కార్తికేయ 2 ‘ తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మరో పాన్ ఇండియా కథాంశంతో సినిమా చేశాడు. అదే స్పై. జూన్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాణంలో రూపొందింది. ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ థీమ్ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ.

రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్. ఆ టైంలో.. అంటే 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి ఆయన చనిపోయినట్లు చరిత్రలో ఉంది. కానీ అది కవరప్ స్టోరీ అని ‘స్పై’ టీజర్ లో చూపించారు. దీంతో (SPY Movie) ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

టీజర్ లోనే అంత స్టఫ్ ఉంది అంటే.. ట్రైలర్ లో , సినిమాలో ఇంకెంత ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంటుందో అని ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను రేపు అనగా జూన్ 22 న ఉదయం 11 : 34 నిమిషాలకి విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం ఈ విషయాన్ని రివీల్ చేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus