స్పైడర్ చివరి షెడ్యూల్ ఎప్పుడంటే ?

  • May 1, 2017 / 07:54 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు మీద ఉన్నారు. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్ మూవీ పనులు చకచకా సాగుతున్నాయి. గత నెల వియాత్నం, చెన్నై లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు  వెంటనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలను కున్నారు. కానీ క్లైమాక్స్ లో మార్పు చేయాలనీ అనుకోవడంతో మురుగదాస్ వారం రోజులు కూర్చిని కొత్త క్లైమాక్స్ రాశారు. దీన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. మే 3 నుంచి హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారు.

నెలాఖరు వరకు సాగే ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. మిగిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా ఎస్.జె సూర్య, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్  నటిస్తున్నారు.  ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus