అరబ్ దేశాల్లోనూ రిలీజ్ కానున్న స్పైడర్
- August 23, 2017 / 09:36 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై ఈ పాటను తెరకెక్కించనున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ రెండు భాషలతో పాటు హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఆ డబ్బింగ్ పనులు కూడా సాగుతున్నాయి. తాజాగా అరబిక్‌లోను డబ్బింగ్ చేస్తున్నారంట.
అరబ్ దేశాల్లో మన సినిమాలకు క్రేజ్ ఉండడంతో అక్కడ కూడా స్పైడర్ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సో స్పైడర్ మూవీ ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 న అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















