Sravana Bhargavi: అన్నమయ్య కీర్తనలు అపహేళన చేసిన శ్రావణ భార్గవి… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించడమే కాకుండా పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం హేమచంద్ర శ్రావణ భార్గవి దంపతుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.హేమచంద్రకు మరో సింగర్ తో సంబంధం ఉండటం వల్లే శ్రావణ భార్గవి తన నుంచి దూరంగా వెళ్లిపోయారని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇకపోతే ఇలా వీరివిడాకులు గురించి నిత్యం ఏదో ఒక వార్త రావడంతో ఈ వార్తలపై శ్రావణ భార్గవి హేమచంద్ర స్పందిస్తూ పూర్తిగా ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. ఈ విధంగా వీరిద్దరూ స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు దొరికింది. ఇకపోతే శ్రావణ భార్గవి మరోసారి వివాదంలో చుక్కుకున్నారు. తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను పాడింది. అంతవరకూ బాగానే ఉంది.

ఆ పాటలో ఆమే నటించడమే ఇప్పుడు పెద్ద ఈ పాటలో శ్రావణ భార్గవి ఒక సాధారణ మహిళ ఏం చేస్తుందో అలా చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా వివాదానికి కారణమైంది. ఎంతో పవిత్రంగా భావించే అన్నమయ్య కీర్తనలతో శ్రావణ భార్గవి ఇలా చేయడం ఏంటి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అన్నమయ్య కీర్తనలను కాళ్లు చేతులు ఊపుతూ నటిస్తావా?

ఈ వీడియోని వైరల్ చేసి టీటీడీ ఈమె పై చర్యలు తీసుకొనేలా చేయాలి అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మరికొందరు స్పందించి శ్రావణ భార్గవి చేసిన ఈ వీడియోలో ఏ విధమైనటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు దీన్ని పెద్ద వివాదంగా చూడడం ఆపేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేకపోతే పెద్ద ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus